COVID Emergency ప్రకటించడంలో WHO ఆలస్యం... ధనిక దేశాలకు పిలుపు!! || Oneindia Telugu

2021-05-13 398

WHO declared COVID-19 emergency very late says Global expert panel
#WHO
#COVID19Emergency
#whocovid19emergencycalllate
#Globalexpertpanel
#UNAIDS
#COVIDVaccination
#COVID19makeitlastpandemic

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సమయానుకూలంగా వ్యవహరించి ఉండుంటే కరోనా వైరస్ విపత్తు ఇంతటి తీవ్రస్థాయిలో ఉండేదికాదని అంతర్జాతీయ నిపుణుల బృందం అభిప్రాయపడింది.కరోనాను ఎదుర్కొనే విషయంలో డబ్ల్యూహెచ్ఓ తొలి నుంచీ తీసుకున్న పేలవమైన నిర్ణయాల వల్లే ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని కొవిడ్ సంసిద్ధతపై ఏర్పడిన అంతర్జాతీయ నిపుణుల బృందం పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు నివారించడానికి ఓ 'అంతర్జాతీయ అప్రమత్త వ్యవస్థ' అవసరమని 'కొవిడ్‌-19: మేక్‌ ఇట్‌ ఇన్‌ ది లాస్ట్‌ పాండమిక్‌' పేరుతో రూపొందించిన నివేదిక సూచించింది.